నవతెలంగాణ-హైదరాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను తాడూరు మండలం మేడిపల్లికి చెందిన శంకర్ (27), కల్వకుర్తికి చెందిన శ్రీకాంత్ (22)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm