నవతెలంగాణ-భద్రాచలం : భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ పరిధిలోని చిత్రకూట మండపంలో గురువారం ఆలయ ఈవో శివాజీ నేతృత్వంలో సిబ్బంది, అధికారులు స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. గతేడాది నవంబర్ 11 నుంచి (84 రోజులు) ఇప్పటివరకు రూ. 2.20 కోట్ల ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు. అలాగే 250 గ్రాముల బంగారం, 2 కిలోల వెండితో పాటు కొంత విదేశీ కరెన్సీ కానుకగా లభించిందన్నారు. డిసెంబర్‌లో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు, జనవరి 1, 2 తేదీల్లో జరిగిన తెప్పోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారన్నారు. ఈ కారణంతోనే భారీగా ఆదాయం పెరిగిందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm