నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్ట శ్మశానవాటికలో కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుమందు ఫిలిం చాంబర్‌లో కే విశ్వనాథ్ పార్థీవదేహానికి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని కళాతపస్వికి తుది వీడ్కోలు పలికారు.
Mon Jan 19, 2015 06:51 pm