నవతెలంగాణ - చెన్నై
ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు. శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో ఆమె కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. వాణీ జయరాం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ వంటి 14 భాషల్లో దాదాపు 20వేలకు పైగా పాటలు ఆలపించారు. తన గొంతులో లాలీ లాలీ, నీ హృదయాన పలికే నా తొలిపల్లవి వంటి మెదలైన పాటలకు ఊపిరి పోశారు. కేంద్ర ప్రభుత్వం 2022 కి పద్మభూషణ్ ని ప్రకటించింది.
Mon Jan 19, 2015 06:51 pm