నవతెలంగాణ - చెన్నై
ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం మరణించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆమె మరణంఅనుమానాస్పదంగా మారింది. ఆమె ముఖంపై, నుదురుపై తీవ్ర గాయాలు ఉండటంతో ఆమె ప్రమాదవశాత్తు జారిపడి మరణించారా ? లేక ఎవరైనా కొట్టి చంపేశారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఫోరెన్సిక్ నిపుణులు దాదాపు అరగంటపాటు వాణీ జయరాం ఫ్లాట్‌ను ఆధీనంలోకి తీసుకుని ఆధారాలు సేకరించారు. మరోవైపు వాణీ జయరాం పార్థివ దేహాన్ని పోస్టుమార్టం కోసం ఒమేదురార్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత ఆమె పార్థివదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 04 Feb,2023 06:07PM