నవతెలంగాణ - అమరావతి
ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్ల విచారణ అంశం సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. పిటిషన్లను త్వరితగతిన విచారించాలని జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం వద్ద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. దీనిపై అమరావతి ప్రాంత రైతులు, ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ ఈ కేసులో తమకు న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు జనవరి 27న అందాయని తెలిపింది. ఇరుపక్షాలు ప్రస్తావించిన అంశాలపై చర్చించిన అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం స్పష్టం చేసింది. ఆలోపు ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని మరోవైపు ప్రభుత్వం కూడా ఆలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతేడాది మార్చి 3న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పునకు అనుకూలంగా పలువురు రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై గతేడాది నవంబరు 28న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నాడు కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేశారు. కానీ ఆరోజు విచారణకు రాలేదు. ఈ తరుణంలో తదుపరి విచారణ తేదీని (ఫిబ్రవరి 23) సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 06 Feb,2023 02:58PM