నవతెలంగాణ - పల్నాడు
ఇద్దరు కుమారులతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పెద్ద చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. శివలింగేశ్వరి (27) అనే మహిళ తన ఇద్దరు కుమారులు చరణ్‌సాయిరెడ్డి (8), జతిన్‌రెడ్డి (4)ను చంపేసి తానూ కూడా ఉరివేసుకుంది.
రొంపిచెర్ల మండలం నల్లగార్లపాడుకు చెందిన దొండేటి శివలింగేశ్వరికి నరసరావుపేటకు చెందిన ఇంద్రసేనారెడ్డితో వివాహం జరిగింది. ఇటీవల వారి కుటుంబంలో తరచూ కలహాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ తరుణంలోనే పిల్లలిద్దరికీ ఉరివేసి, అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 06 Feb,2023 07:24PM