నవతెలంగాణ - ముంబయి : అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంతో 60,584 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 17,791 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.71 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టీసీఎస్, ఎంఅండ్‌ఎం, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, ఐటీసీ, హెచ్‌యూఎల్, సన్‌ఫార్మా, టైటన్, టాటా మోటార్స్, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm