నవతెలంగాణ - తుర్కియే
తుర్కియే భూకంపంలో మృతుల సంఖ్య 4500కు చేరుకున్నది. తుర్కియే, సిరియా దేశాల్లో సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 4500కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. తుర్కియేలో ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. వరుసగా మూడు భారీ భూకంపాలతో ఆ దేశం అతలాకుతలమైనట్లు అధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్డగోన్ తెలిపారు. తుర్కియేలో సుమారు 185 సార్లు భూ ప్రకంపనలు నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఖరమన్‌మారస్ కేంద్రంగా భూమి కంపించిన విషయం తెలిసిందే. రెండో కంపం 7.7 తీవ్రతతో, మూడవది 7.6 తీవ్రతతో సంభవించినట్లు అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 07 Feb,2023 10:30AM