నవతెలంగాణ - నరసరావుపేట
ఇద్దరు పిల్లలకు ఉరేసి తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పెదచెరువు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. డీఎస్పీ విజయభాస్కరరావు కథనం ప్రకారం.. రొంపిచర్ల మండలం నలగార్లపాడుకు చెందిన శివలింగేశ్వరి(27)తో నరసరావుపేటకు చెందిన ఇంద్రసేనారెడ్డికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. అతను పట్టణంలోని గుంటూరు రోడ్డులో ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. వీరికి చరణ్‌సాయిరెడ్డి(8), జతిన్‌రెడ్డి(4) పిల్లలు ఉన్నారు. ఇంద్రసేనారెడ్డి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని రోజూ భార్యను హింసించేవాడు. ఈ క్రమంలో సోమవారం కూడా కొట్టడంతో మనస్తాపం చెందిన ఆమె భర్త బయటకు వెళ్లగానే పిల్లలకు ఉరేసి, తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 07 Feb,2023 11:47AM