నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జోటు చేసుకుంది. గిల్గిత్ బాల్టిస్థాన్లోని దయామిర్ జిల్లాలో అతివేగంగా వస్తున్న ఓ ప్యాసింజర్ బస్సు.. కారును బలంగా ఢీకొట్టింది. అనంతరం రెండు వాహనాలు లోయలో పడిపోయాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 30 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. శవపరీక్షల నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. చీకటిగా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm