నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఆయన పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ది చేకూరేలా బుచ్చిబాబు వ్యవహరించారని సీబీఐ చెబుతోంది. అరెస్టుకు ముందు గత రాత్రి ఢిల్లీలో బుచ్చిబాబును ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. ఆయనను అరెస్ట్ చేసినట్టు ఈ ఉదయం ప్రకటించారు. వైద్య పరీక్షల అనంతరం రౌస్ ఎవెన్యూ కోర్టులో బుచ్చిబాబును హాజరుపరచనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm