నవతెలంగాణ - ఢీల్లి
అదానీ గ్రూప్ వ్యవహారంపై లోక్‌సభలో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం గౌతం అదానీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ తాజాగా నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో చేసిన ఆరోపణలపై స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దన్నారు. బుధవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అదానీ వ్యవహారాన్ని ప్రస్తావించారు.
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక అంశంపై విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయాన్ని పునరుద్ఘాటించారు. గత 10 రోజుల్లో రూ.10లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కుప్పకూలిందని, కేంద్ర ప్రభుత్వం దీనిపై సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ) ఏర్పాటు చేయాలన్న విపక్షాల డిమాండ్‌కు అంగీకరించాలన్నారు. లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 08 Feb,2023 05:45PM