Minister @KTRBRS today inaugurated #HyderabadEMotorShow2023, held as part of annual Hyderabad #EMobilityWeek.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 8, 2023
In the years to come, the e-motor show will emerge as a pioneering platform for automobile companies to launch and showcase their next generation EV models. pic.twitter.com/7g4GpUSUMu
నవతెలంగాణ - హైదరాబాద్
మాదాపూర్‌లోని హైటెక్స్‌లో బుధవారం హైదరాబాద్ ఇ-మొబిలిటీ వీక్‌లో భాగంగా మొదటి ఎడిషన్ ‘ఈవీ మోటార్’ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా తెలంగాణ మారబోతుందని స్పష్టం చేశారు. దేశీయ, ప్రపంచ కంపెనీలు ఈవీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు, మహీంద్రా, ఒలెకార్ట, జెడ్‌ఎఫ్, మైస్ట్రాహ్, గ్రావ్టాన్, హ్యూడాయ్ మొబిస్, వన్ మోటో, ప్యూర్ ఈవీ వంటి ప్రముఖ కంపెనీలకు తెలంగాణ ఇప్పటికే నిలయంగా మారిందని, ప్రొగ్రెసివ్ ఈవీ అడాప్షన్ పాలసీ, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా సామార్థ్యంతో దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్’ స్టేట్‌గా తెలంగాణ అవతరించబోతుందని కేటీఆర్ తెలిపారు.