నవతెలంగాణ - పట్నా
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో అవధ్-అసోం ఎక్స్‌ప్రెస్‌కు భారీ ప్రమాదం తప్పింది. అవధ్-అసోం ఎక్స్‌ప్రెస్ అసోంలోని డిబ్రూగఢ్ నుంచి బెంగాల్‌లోని లాల్‌గఢ్‌కు వెళ్తున్న తరుణంలో బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఉన్న రామ్‌దయాలు స్టేషన్‌కు సమీపంలోకి వచ్చిన తర్వాత రైలులోని బీ2 ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో బోగీలో పెద్దఎత్తున్న పొగలు కమ్ముకున్నాయి. ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలో రైలు వెంటనే ఆగడంతో ప్రయాణికులందా బోగీలోనుంచి కిందికి దూకేశారు. స్పందించిన అధికారులు మంటలను అదుపుచేశారు. విచారణ నిమిత్తం రైలును తరలించారు. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm