నవతెలంగాణ - హైదరాబాద్
శాసనసభలో నేటి నుంచి బడ్జెట్ కేటాయింపులపై చర్చజరుగనుంది. ఈ తరుణంలో మూడు రోజులపాటు బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు. తొలిరోజైన నేడు సంక్షేమం, రహదారులు-భవనాలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, పౌరసరఫరాలు, పర్యాటక, క్రీడాశాఖలకు సంబంధించిన మొత్తం 12 పద్దులపై చర్చించనున్నారు. సభ ప్రారంభమవగానే ప్రశ్నోత్తరాలు జరుగనున్నాయి.
ఈ క్రమంలోనే ఎస్‌ఆర్‌డీపీ, గొర్రెల పెంపకం, మైనార్టీలకు రుణాలు, కల్యాణలక్ష్మి పథకం, ఎకో టూరిజం, సమీకృత జిల్లా కార్యాలయాలు, ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు, గనుల రాబడి, సబర్బన్ బస్సుల అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్ రావు సమాధానం ఇస్తారు. దీంతో మండలిలో ప్రశ్నోత్తరాలను రద్దుచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 09 Feb,2023 08:59AM