నవతెలంగాణ - నిజామాబాద్
నిజామాబాద్ జిల్లాలో రోడ్డుప్రమాదంలో ఓ చిరుత మృతి చెందింది. జిల్లాలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం చిరుతను ఢీకొట్టింది. దీంతో చిరుత అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న అటవీ, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం చిరుతను ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm