నవతెలంగాణ హైదరాబాద్: భూకంపం ధాటికి సర్వం కోల్పోయిన తుర్కియేలోని ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గడ్డకట్టే చలిలో వారంతా తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చలిని తట్టుకునేందుకు కోసం పార్కుల్లోని బెంచీలు, పిల్లల బట్టలను తగలబెడుతూ చలి కాచ్చుకుంటున్నారు. రేపు పిల్లలకు కనీసం బట్టలు లేకపోతే నెత్తురుసైతం గడ్డకట్టే చలిలో ఆపిల్లల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో. తుర్కియే, సిరియాలలో ఇలాంటి హృదయ విదారక దృశ్యాలెన్నో అడుగడుగున కన్పిస్తున్నాయి. హృదయాన్ని కలిచివేసే ఇలాంటి విషాదానికి అంతమెక్కడో తెలియక ఆ రెండు దేశాలు క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm