నవతెలంగాణ హైదరాబాద్: ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మళ్లీ తన కుమార్తె కిమ్-జు-యేతో కనిపించారు. ఉత్తరకొరియా సైనిక వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా బుధవారం ఆ దేశాధ్యక్షుడు కిమ్ సైనికాధికారులతో భేటి అయ్యారు. త్వరలో భారీ సైనిక కవాతు జరగనుందని, అందులో ఉత్తరకొరియా తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపనుందన్న వార్తలొస్తున్న నేపథ్యంలో కిమ్.. సైన్యంలోని ప్రముఖలతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, కిమ్ ఈ సమావేశానికి కుమార్తెతో కలిసి హజర్వడం విశేషం.
Mon Jan 19, 2015 06:51 pm