నవతెలంగాణ - హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ లో కలిసిన 12 మంది ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలని కోరుతూ రాష్ట్ర డిజిపి కి ఫిర్యాదు చేశారు. ఈ 12 మంది ఎమ్మెల్యేల కేసును సిబిఐకి ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐకి ఇస్తున్న నేపథ్యంలో ఈ కేసును కూడా వారికి అప్పగించాలని కోరారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా లబ్ధి పొందాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కేసు నెంబర్ 455లో తమ ఫిర్యాదును కూడా జత చేయాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 09 Feb,2023 03:55PM