నవతెలంగాణ-హైదరాబాద్ : బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్‌పుర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 77/1 స్కోరుతో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ భారత బౌలర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది. ఇక తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆరంభం నుంచి దూకూడుగా ఆడారు ఓపెనర్లు రోహిత్ శర్మ, కె ఎల్ రాహుల్ 69 బంతుల్లో రోహిత్ శర్మ తొమ్మిది ఫోర్లు, ఒక సక్స్ తో 56 పరుగులు చేసి ఆర్ధ సంచరీ పూర్తి చేశాడు. ఇక 76 పరుగుల వద్ద కె ఎల్ రాహుల్ (20) అవుట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి అశ్విన్ వచ్చాడు.
Mon Jan 19, 2015 06:51 pm