నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్-ఆస్ట్రేలియా మధ్య విశాఖలో జరగాల్సిన రెండో వన్డే సకాలంలో జరగనుంది. నగరంలో వర్షం పూర్తిగా తగ్గి ఎండ వచ్చింది. దీంతో మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గ్రౌండ్ సిబ్బంది మైదానంలో కవర్లను తొలగించి వర్షపు నీటిని బయటకు పంపిచారు. ఈ నేపద్యంలో టాస్ కూడ వేశారు. ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వర్షం తగ్గడం.. అనుకున్న సమయానికి మ్యాచ్ జరుగుతుండటంతో వైజాగ్ స్టేడియం వద్ద సందడి నెలకొంది. క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. టికెట్లు ఉన్నవాళ్లను స్టేడియం లోపలికి అనుమతిస్తున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో నగరంలోని హనుమంతవాక ,కార్ షెడ్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Mon Jan 19, 2015 06:51 pm