నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి చుక్కెదురైంది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చిటికెన నవీన్ కుమార్ కుటుంబీకులను పరామర్శించేందుకు ఆయన ఆదివారం సిరిసిల్ల పట్టణానికి వెళ్లారు. కానీ పరామర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను నవీన్ కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. తన కుమారుడి మరణంపై దయచేసి శవ రాజకీయాలను చేయొద్దు అంటూ నవీన్ తండ్రి నాగభూషణం దండం పెట్టి విజ్ఞప్తి చేశాడు. మీ రాజకీయ లబ్ది కోసం ఇవాళ వస్తారు.. పోతారు.. కానీ మాకు అండగా ఉండేది మంత్రి కేటీఆర్ అని తేల్చి చెప్పాడు. బాధిత కుటుంబాల వ్యాఖ్యలతో చేసేదేమీ లేక కాంగ్రెస్ నాయకులు బిక్కమొకాలు వేసుకుని తిరిగొచ్చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm