నవతెలంగాణ - లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. తమ డిమాండ్ల కోసం గత మూడు రోజులుగా విధులను బహిష్కరించారు. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. విద్యుత్ సంస్థల్లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంపిక ప్రక్రియ కోసం, వేతనాల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు గురువారం రాత్రి నుంచి సమ్మె చేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్త సమ్మె ఆదివారం కూడా కొనసాగింది. ఫరూఖాబాద్, ముజఫర్‌నగర్, ప్రయాగ్‌రాజ్‌లో సమ్మె తీవ్ర స్థాయికి చేరింది.
Mon Jan 19, 2015 06:51 pm