నవతెలంగాణ - న్యూఢిల్లీ: మరో రెండు వారాల్లో ఐపీఎల్ పండుగ ప్రారంభం కాబోతోంది. ఈ నెల 31న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్న ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ -చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ సీజన్ కోసం సన్నద్ధమవుతున్న ఢిల్లీ కేపిటల్స్ ఆదివారం కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఢిల్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. బ్లూ, రెండ్ కాంబినేషన్‌లో జెర్సీ ఆకట్టుకునేలా ఉంది. ఏప్రిల్ 1న ఢిల్లీ కేపిటల్స్ తన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడుతుంది. లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక, తొలి హోం గేమ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 4న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm