నవతెలంగాణ - హైదరాబాద్
ఏపీలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఒక్కటి కూడా గెలవలేకపోవడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక అని స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకులు... పట్టభద్రులు అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. అధికారం తలకెక్కిన నేతలకు పట్టభద్రులు కనువిప్పు కలిగించారని పేర్కొన్నారు. సందిగ్ధంలో ఉన్నవారికి పట్టభద్రులు దారిచూపించారని వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితమే వస్తుందని స్పష్టమైందని పవన్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm