Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
Dasharathi-CNR-Birth-Anniversary-2020| కవితా రూపాల అధ్యయనానికి దివిటీ దాశరథి కవిత | దాశరధి-సినారె -జయంతి-2020 | www.NavaTelangana.com

  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • కవరేజ్
  • ➲
  • దాశరధి-సినారె -జయంతి-2020
  • ➲
  • స్టోరి

కవితా రూపాల అధ్యయనానికి దివిటీ దాశరథి కవిత

Mon 20 Jul 16:00:29.917624 2020

ఒక నిర్దిష్ట రూపం నుంచి ఒక పరిణామం దాకా రూపంతో కొనసాగిన కవులు రచయితలు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి అరుదైన అవకాశం సమకాలీనంగా కవిగా సాగడం వలన దాశరథికి లభించింది. సాహిత్య ప్రక్రియల్లో రూపాలు మారుతూ ఉంటాయి. కొంతకొంతగా ఆధునికతను సంతరించుకుంటూ ప్రక్రియా రూపాలు మారుతాయి. ఈ మార్పు ఎంత బలంగా ఉంటుందంటే ఒక్కో సారి రూపాలు కూడా ప్రక్రియలనుకునేంతగా మార్పును పొందుతాయి. సాధారణంగా ఈ రూపాలు మార్పు పొందడానికి కూడా శతాబ్దాలు పట్టిన సందర్భాలున్నాయి. కాని ఆధునిక పద్యం అనే రూపం నుంచి వచన కవిత దాకా వచ్చిన పరిణామాలు చాలా వేగంగా జరిగాయి. ఐతిహాసిక పద్యకవితా రూపం ప్రాబంధిక పద్యకవితా రూపంగా మారడానికి చాలా కాలం పట్టింది. సుమారు కొన్ని శతాబ్దాలు. ఈ మార్పు కవిత్వం అనే ప్రక్రియ ఆకరంగా చేసుకున్న పద్య రూపంలో కాకుండా వస్తు చిత్రణలో వచ్చిన మార్పు. తరువాత కాలంలో కావ్యాలు, ఖండకావ్యాలు ఆధునిక పద్యం అనే రూపాలు కవిత్వంలో కనిపిస్తాయి. ఈ కాలం సుమారుగా పంతొమ్మిదివందల నలభై కాలం. ముప్పైరెండులలో వచ్చిన గోలకొండ కవుల సంచికలోనూ రూపపరంగా ఖండికలున్నాయిగాని, వస్తువు పరిపూర్ణంగా ఆధునికమైంది కాదు. స్తోత్రాలు, స్తుతులు, మహా పురుష ప్రశంస ఇలాంటివి అందులో ఉన్నాయి. దానికి దగ్గరలో ఆధునిక పద్య రూపం కనిపిస్తుంది. ఆ తరువాత గేయ కవిత, దానికి దగ్గరలో వచనగేయం, ఆ తరువాత వచన కవిత కనిపిస్తుంది. దాశరథి కవిత్వాన్ని గమనించినా, ఆయా కాలాల్లో వచ్చిన 'ప్రత్యూష' (1950) లాంటి సంకలనాలను గమనించినా ఈ విషయం అర్థమవుతుంది.
           దాశరథి ఆధునిక పద్య రూపాలనుంచి వచన కవిత తొలిరూపం దాకా రాశారు. ఆధునిక పద్యానికి మంచి నిర్వచనం కూడా దాశరథినుంచే దొరుకుతుంది. సుమారు డెబ్బై కాలానికి దగ్గరలో కూడా అంటే సుమారు వచన కవితకొక ప్రాతిపదిక ఏర్పడ్డాక కూడా ఆధునిక పద్య కవిత బలమైన ఉనికిలో ఉంది. వస్తువు, ఇతివృత్తం, శైలి, శిల్పాలు ఆధునికమైనవి. రూపం విషయంలో ప్రాచీన పద్య ఛందస్సులకు సంబంధించినది ఆధునిక పద్యం. రూపం విషయంలో గేయ ఛందస్సులను శిల్పం, భాష, శైలి, వస్తువు, ఇతివృత్తాలలో ఆధునిక పద్య రూపాన్ని అనుసరించినది ఆధునిక గేయ కవిత్వం. దీని ప్రాతిపదిక ముప్పైలలోనే ఉన్నా బలంగా, ప్రయోగాత్మకంగా కనిపించింది యాభై అయిదు కాలాల తరువాతే. నిజానికి గేయ కావ్యాల కన్నా ముందు గేయ నాటికలున్నాయి. గేయమనే మాత్రారూప ఛందస్సును అనుసరించినది గేయ కవిత్వం. ఈ గేయంలోని కేవల గతిలక్షణాన్ని, లయను మిగుల్చుకొని ఛందస్సులను వదిలివేసిన కవితా రూపం వచన గేయం. లయగుణాన్ని, మాత్రారీతిని వదిలి వచనాన్ని మాత్రమే కలిగింది వచన కవిత. ఈ రూపాలన్నీ అనుసరించిన వారు దాశరథి. డెబ్బై కాలాల్లో వచ్చిన ఆయన కవిత్వంలో ఈ రూపాలన్నీ కనిపిస్తాయి.
1. ప్రాణ జ్వాలిక ఫాలభాగమున విభ్రాజిల్లుచుండంగ ని
ద్రాణంబైన ధరాతలంబునకు చైతన్య ప్రభాపుంజముల్‌
దానంబీయగ జాలు తైజస పదార్థంబీవు; నీ కన్న నా
కేనా డెవెవ్వరులేరు మిత్రులు, శుభాంగీ! కాంతి కాంతామణీ!

పూల కారేరాక పుష్పింతువీవు
శిశిర రుతువేలేక క్షీణింతువీవు
అక్షులే లేకుండ అశ్రులోడ్చెదవు
అస్యమే లేకుండ హసియించగలవు - (కొవ్వువత్తి)

2. గజదంతగోపురం/ లో కాదు కాపురం
కార్మికులుగల పురం/ కవితి అంత:పురం
పెద్దపొగ గొట్టాలు/ పేదలకు చుట్టాలు
ఆ ధూమ పటలాలు /బాధితుల నిటలాలు - (గజదంత గోపురం)

3. పోతున్నది పాతయుగం- పోనీ పోనీ
వస్తున్నది కొత్త తరం - రానీ రానీ
దిసమొలలై ఉన్న లతా విసరమ్ములకు
కుసుమాలే వసనావలి కానీ కానీ - (మధుతోరణము)

4. నౌబత్‌ పహాడ్‌ మీదినుంచి చూస్తే
నాలుగుమైళ్ళ మేర అయినా కనబడదు
చార్‌ మినార్‌ పైనుంచి పరికిస్తే
'సారా' హైదరాబాద్‌ సాక్షాత్కరించదు
గోలకొండ గోపురాగ్రం నుంచి దర్శిస్తే
కొంత దూరం మించి కంటికి కానరాదు- (తల్లి పూజకు తరలిరండి)

5. శాంతియుత ప్రయోజనాల కోసం అణువు ను భేదించిన శాస్త్రజ్ఞులారా!
భారత కీర్తి దశదిశలా వ్యాపిస్తుంటే/ భయపడే వారి గగ్గోలును విన్నారా!
కత్తితో కుత్తుకలను మాత్రమే/ ఉత్తరించ వచ్చుననే చిత్తవృత్తిగలవారు/ కత్తితో మెత్తని గులాబీల
అంట్లుకట్టవచ్చునని/ కడుపులోని విషవ్రణాల తొలగించవచ్చునని/ కడుతియ్యని మామిడిపండ్లు కోసుకు
తినవచ్చనీ/ గ్రహించి సగనం వహించలేరు, పాపం'' -(అణుగీతం)
ఈ వాక్యాలన్నీ, కవితా భాగాలన్నీ వివిధ కవితా రూపాలననుసరించి రాసినవి. వరుసగా పద్యం, గేయం, వచన గేయం, వచన కవిత అనే కవితా రూపాలను అనుసరించి రాసినవి. ఇవన్నీ ఒకే సంపుటిలోనివి కావడం విశేషం. యాభైల కాలం నాటికి స్పష్టంగా వచన కవితకొక రూపం ఏర్పడినా పద్యం గేయాల ఉనికి తగ్గలేదు. ఆ మాటకొస్తే ఈ కాలానికి పద్యం ఏదో ఒక రూపంలో శ్వాస పీలుస్తూనే ఉంది. ఈ పద్యం పూర్తిగా ఆధునికమైంది. ఇది అనువాదమే అయినా రూపపరంగా, వస్తుపరంగా ఆధునికమైనది. శ్రీశ్రీ నాటి అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ లాగా కొవ్వొత్తిని వస్తువుగా తీసుకుని విలువలను ఇతివృత్తంగా చేసుకుని రాసిన పద్యమిది. ''నిద్రాణంబైన ధరాతలంబునకు చైతన్యప్రభా పుంజముల్‌ దానంబీయగ జాలు తైజస పదార్థంబీవు'' అనడంలోనే అభ్యుదయ భావన కనిపిస్తుంది. ఇక రెండవ పద్యంలో భావదృష్టి వికసించింది. రకరకాల రుతువులతో సమన్వయంచేసి చెప్పడంవల్ల ఈ లక్షణం కనిపిస్తుంది. కొవ్వత్తిని కన్నీరు కారుస్తున్నావనడంలో, అందులోనూ కళ్ళులేకుండా కన్నీరు కారుస్తున్నావనడంలో భావనాఛాయ స్పష్టంగా కనిపిస్తుంది. పద్యంలో వర్ణన ఉన్నా అభ్యుదయ చింతన భావోద్దీపన ఈ రెండూ ఆధునికమైనవి. శుభాంగీ, కాంతి కాంతామణీ- లాంటి సంబోధనలు, తైజస పదార్థం లాంటి సమాసాలు మాత్రమే ఒకింత ప్రాచీన పద్య శైలిని ఇముడ్చుకున్న భాగాలు భాషాగతంగా.
రెండవ భాగంలో ఖండగతి నడకలోని గేయకవిత్వ రీతి ఉంది. విషయాన్ని అదే కవితామార్గంలో చెప్పినా గేయ కవితా రూపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటివి మరికొన్ని ఈ కాలానికి దగ్గరగా కనిపిస్తాయి. దీనిని ఛందోబద్ధంగా కూడా విశ్లేషించుకోవచ్చు. క్రియల పరంగా కూడా ఆదితాళంలో ఇమిడిపోతుంది. గేయ కవిత ముప్పైల కాలానికి మొదలై ఆ తరువాతి కాలాల్లో బలపడింది. మూడవ భాగం లోనిది వచన గేయం. గేయంలోని లయను అనుసరించింది కాని తాళం, క్రియలు ఛందస్సు విషయంలో స్వేచ్ఛ కనిపిస్తుంది. తిశ్రగతిలోఉన్నా వాక్యాల్లో వచన తత్త్వం ఎక్కువగా కనిపిస్తుంది. నాలుగు అయిదు భాగాలలో వచనకవితా రూపం కనిపిస్తుంది. అందులోనూ నాలుగులో ప్రాసాత్మకత వలన కొంత గేయ రూపంలోని లయ ధ్వనించినా, చివరి భాగంలో పూర్తి వచన రూపం కనిపిస్తుంది. 'ఏది విప్లవం, ఎర్రబాలలు' లాంటి ఖండికలు అభ్యుదయం నుంచి విప్లవగతికి మారుతున్న కవితా మార్గాన్ని చెబుతాయి. గాంధీని గురించి రాసిన 'విప్లవ నాయకుడు, శాంతిబాల' లాంటి ఖండికలు ఆయనదైన అభ్యుదయ మార్గాన్ని చెబుతాయి.
అనేక రూపాలు పరిణామాన్ని పొందుతున్న కాలంలో ఉండడం వలన దాశరథి కవితలో ఈ రూపాలన్నీ ప్రతిబింబిస్తాయి. గమనించాల్సింది ఏమిటంటే ఏ రూపం మారినా దాని తాలుకు శైలిని, నిర్మాణాన్ని, భాషను, శయ్యను గమనించి దాశరథి కవిత నడిచింది. దాశరథి కవితా పరికరాలే ప్రత్యేకం. అవి ఎంత ఆధునికమైనవో, అంత సంప్రదాయ ముద్రను ఊనిక చేసుకున్నవి. ఎంత భావ యుక్తమైనవో ఆయన అధ్యయనంతో అంతే హుందాగా నడచివచ్చినవి. 'షా: నామా' అనే కవితను ఈ సంపుటంలో అనువదించారు. ఇందులో వర్ణన ఉర్దూ కవితాసమాగ్రిని అనుకొని కనిపిస్తుంది. కాని వాటిలో భావ కవిత నాటి ఆధునిక ఛాయ కూడా పద్యాన్ని నీడలా అనుసరిస్తుంది.
''నెలత బుగ్గలులేత దానిమ్మపూలు/ ఆమె పెదవులు జ్వలియించు అగ్నిశిఖలు
పడతి చనుదోయి రజత కుంభమ్ములౌరా/ కనులు కాటుక పిట్ట రెక్కలనుబోలు
ఆమె మైతావి కస్తూరినతిశయించు/ గొలుసుగొలుసులు గొలుసులు వెలది కురులు
కాంత పదివేళ్లు పదివెండికలములౌర!/ ఎవరి ఫాలాననేమి లిఖియించగలవో'' - (సౌందర్యాధిదేవత)
   ఈ వాక్యాలు దాశరథి కవితా పరికరాలను, వాటి మూలాలను చెబుతాయి. బహుశ: బుగ్గలను దానిమ్మ పూలుగా, పెదాలను అగ్నిశిఖలుగా,కనులు కాటుక పిట్ట రెక్కలుగా చెప్పడంలోనే నవ్యత కనిపిస్తుంది. 'అరాల కుంతల' లాంటి పాత ప్రయోగాలు లేకుండా గొలుసులు గొలుసులని చెప్పడంలో తనదైన ఉర్దూ పరికరాల ముద్ర కనిపిస్తుంది. ఒకచోట చెట్టునూ 'అగ్నిపూల షామియాన' అంటారు. ఇలాంటివన్నీ ఈ కాలంలోని కవిత్వం నుంచి ఎత్తి రాసుకోవచ్చు.
  దాశరథి ఆధునిక పద్యం నుంచి వచనకవిత దాక అనేక రూపాలను రాశారు. అయితే ఏ రూపానికుండే పరిణతులను, మార్పులను అందులో అనుసరించారు. అది ఆయన అధ్యయనానికి నిదర్శనం. పద్యాన్ని నిర్వహిస్తున్న విధానం, పాద విభజన, వాక్యాల విభజన ఇవి పద్యం నుంచి వచన కవిత ఏర్పడిన విధానాన్ని ప్రధానంగా రూపపరంగా గమనించడానికి సహాయపడేవి. పద్యకవితలో గణ బద్ధ ఛందస్సుననుసరించి, గేయంలో మాత్రాగణాల ననుసరించి పాద విభజన జరిగితే, వచనగేయంలో అంత్యప్రాస ఈ విభజనకు ఉనికి వచన కవితలో వరుసలు అర్థ గతంగా వేరుపడుతాయి. చాలామంది వచన కవిత రాసేవాళ్ళు ఈ అంశాన్ని గమనించినట్టు కనిపించదు. ఈ నాలుగు రూపాల మధ్య సారూప్యతలను, వైరుధ్యాలను, వైవిధ్యాలను అధ్యయనం చేయడానికి దాశరథి కవిత మార్గాన్ని చూపుతుంది. వచనకవిత ఉదయించిన మార్గానికి దీపపు వెలుగుని చూపుతుంది. ఆధునిక పద్యం నుంచి వచన కవిత దాకా అన్ని మలుపుల్లో దాశరథి కవిత తనను మార్చుకుంటూ నడిచింది.
- ఎం.నారాయణ శర్మ,
9177260385

Feature Sponsers

దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020

దాశరధి-సినారె -జయంతి-2020 - మరిన్ని

01-08-2020

తెలుగు జాతి కీర్తి శిఖరం సినారె

31-07-2020

చిరస్మరణీయం

31-07-2020

సినారే ఏమి రా!సినారె ఏమిరాసినారె!!

30-07-2020

జ్ఞాన శిఖరం

30-07-2020

నీరాజనాలు

30-07-2020

భలా సినారె

30-07-2020

సుకవీశ్వరుడు

29-07-2020

నీ ఘనత

29-07-2020

కవికుల వతంసుడు

29-07-2020

తెలుగు వెలుగుల రేడు 'సినారె'

28-07-2020

తెలంగాణ సింగిడి సినారె

29-07-2020

సాహిత్య దివిటీ (‌సినారె)

29-07-2020

తెలంగాణప్రజల గీతము

28-07-2020

వెలుతురు ఈలలు

28-07-2020

నా రణం మరణంపైనే

28-07-2020

ఎవ్వడురా అన్నది...

28-07-2020

''తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవం కల్పించిన డా|| సినారె''

28-07-2020

''ఎవ్వడురా అన్నది కమ్యూనిజం ఇక లేదని'' : సినారె

28-07-2020

సినారె మానవతాగానం

28-07-2020

సినారె సాహిత్యం - అభ్యుదయ గళం - మధ్యతరగతి మందహాసం

28-07-2020

చిత్రం.. భళారే విచిత్రం

28-07-2020

సి నా రె భళారే

28-07-2020

తెలంగాణ కోటి రతనాల వీణ దాశరథి

28-07-2020

కవిరేడు సి నా రె

27-07-2020

సినారె జీవితం-సాహిత్యం

23-07-2020

ప్రపంచ పోకడల పంచపదులు

23-07-2020

మణి పూసలు

27-07-2020

సాహితీ శిఖరం -సినారె

27-07-2020

విశ్వంభరుడు-సి నా రె

27-07-2020

సాహిత్య సిరి సి.నా.రె

27-07-2020

ఉద్యమ కవిసారధి-దాశరధి

27-07-2020

కవితా సారథి-దాశరథి

27-07-2020

కవి సింహం దాశరథి

26-07-2020

మనసు దో 'సినారె'

26-07-2020

భళారే సినారే

26-07-2020

అతడొక అగ్నిపర్వతం

26-07-2020

కవిసింహా

26-07-2020

అచ్చమైన ప్రజాకవి దాశరథి

25-07-2020

సరిగమలు పదనిసలు సరసమైన గమాకాలు

25-07-2020

మహా అగ్ని జ్వాల ఘనుడు

25-07-2020

గజల్

25-07-2020

చిన్నబోయింది సాహిత్యం

24-07-2020

తెలుగుతల్లి కిరీటాన వజ్రపు తళుకు

25-07-2020

తెలుగువెలుగైన సినారే

24-07-2020

అక్షర సూరీడు…సినారె

24-07-2020

సాహితీ సమరశంఖం

24-07-2020

అక్షరాలతో కనువిందు చేసిన కలం

21-07-2020

గజల్ లహరి

24-07-2020

ఆధునిక సాహితీ శిఖరం

24-07-2020

వీధిబడిలో విశ్వంభరుడు.

24-07-2020

కారణ జన్ముడు సి.నా.రె

23-07-2020

ధీశాలి దాశరథి

23-07-2020

దాశరథి కృష్ణమాచార్య

23-07-2020

తెలంగాణ సాహితి విప్లవ జ్యోతి

23-07-2020

గజల్

23-07-2020

అగ్నివీణ

22-07-2020

దాశరథి కృష్ణమాచార్య

22-07-2020

ప్రజాకవి

22-07-2020

అచ్చమైన ప్రజాకవి దాశరథి

20-07-2020

తెలుగు సంతకం -సినారే

22-07-2020

విశ్వంభర కవికి కవితాక్షర నివాళి!

22-07-2020

మళ్లీ పుట్టాలి సినారె

22-07-2020

చెరగని ముద్ర

22-07-2020

సాహిత్య ప్రపంచపు అరుదైన ద్రువతార - డా. సి నారాయణరెడ్డి

22-07-2020

మండిన గుండె

22-07-2020

కవిసింహం దాశరథి

22-07-2020

సినారె

22-07-2020

అక్షర శిల్పి

22-07-2020

సాహితీ సమ్రాట్ సినారె

20-07-2020

ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో

20-07-2020

సినారె!

22-07-2020

అక్షరమే ఆయుధమై

22-07-2020

పాట కావ్యమై పరిమళించింది

20-07-2020

విశ్వంభరుడుగా డా.సినారె

20-07-2020

సి. నా. రె

20-07-2020

కవితా స్వాప్నికుడు

20-07-2020

వేయి పున్నముల కవితాచంద్రుడు

20-07-2020

సార్థక నామధేయ ఓ దాశరథీ!

20-07-2020

కవితాశరథి

21-07-2020

సినారె సినిమా పాటలు

21-07-2020

దాశరథీ..శరథీ..రథీ..!

21-07-2020

సాహిత్య రవి(కవి) చంద్రులు

21-07-2020

విశ్వరంభరుడు డా.సినారె

21-07-2020

తెలుగు గజల్స్ రారాజు

21-07-2020

దశరథముల కృష్ణమాచార్యుడు

20-07-2020

కవితా యోధుడు

21-07-2020

నిప్పురవ్వ

21-07-2020

మహా కవి దాశరథి

21-07-2020

కవిత్వం ఆయన చిరునామా

21-07-2020

మన కాలపు మహాకవికి ఘనమైన గౌరవం

21-07-2020

'పబ్బతి'

21-07-2020

తెలంగాణా జనచైతన్య ప్రతీక - దాశరథి

20-07-2020

దాశరథీ ,కవితాశరథీ.

20-07-2020

మహాకవులకు అక్షర నివాళులు

20-07-2020

దాశరథి కృష్ణమాచార్యలు

20-07-2020

తెలంగాణ ఫిరంగి

20-07-2020

మహాకవి_దాశరథి

20-07-2020

దాశరథి!

20-07-2020

అక్షర కొలిమిలో ఉదయించిన సూరీడు

20-07-2020

కవిసింహం

20-07-2020

తెలంగాణ జీవితాలకు దర్పణం దాశరథి కథ

20-07-2020

పెన్నూ గన్నూ ఎత్తిన ప్రజాకవి దాశరథి

20-07-2020

సంభాషణల్లో ప్రత్యేకత దాశరథి నాటికల స్వభావం

20-07-2020

దాశరథి జాతీయత - శాంతికాముకత

20-07-2020

దాశరథి కవిత్వ చైతన్యం

20-07-2020

తిరుగుబాటు కవిత్వం జీవితం -దాశరథి

20-07-2020

తెలుగు సినీ సాహితీ విశారదుడు - దాశరథి

20-07-2020

తొలి తెలుగు గజల్ కవి..

20-07-2020

దాశరథి కవిత్వంలో పోరాట దృక్పథం

20-07-2020

'ఖుషీఖుషీగా..' సాగిన దాశరథి

20-07-2020

సాహితీ యోధుడు దాశరథి కృష్ణమాచార్య

20-07-2020

కాలాన్ని జయించిన కవి దాశరథి

20-07-2020

తెలంగాణ రుద్ర‌వీణ‌

20-07-2020

సుకవితాశరథీ... దాశరథీ

20-07-2020

ఇంకా ఆరని చితాగ్నిని

Recomended For You

దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.