Mon 20 Jul 21:05:15.542256 2020
అంగారమునెలిగించి
శృంగారమును రగిలించినావు..
నైజాము గుండెలో నిదురించి
ప్రజాక్షేమంకోరి ధిక్కరించిన మీ స్వరాన నినదించినావు..
అగ్నిధారలు కురిపించి
తిమిరంతో సమరంచేసినావు..
పునర్నవంతో పులకింపజేసి
గాలిబ్ ప్రణయగాయాలగేయాలకు నగిషీలద్దినావు..
తెనుగుతల్లికి తేటపాటల అమృతాభిషేకాలు చేసి
నీవుకలలుగన్న మహాంద్రదోయమును తిలికించినావు..
నా తెలంగాణ కోటిరతనాలవీణయని తంత్రుల మీటి కోటిభావాల రాగాలు పలికించి
అహరహం కవితాసేద్యంలో తపించి శ్రమించి తరియించినావు...
దాశరధీ!..
అంగారశృంగార రసభావ మహానిధీ
నీ మార్గమే మాకుఎల్లప్పుడూశరణాగతి.
---నల్లగొండ
8309452179