Mon 20 Jul 21:06:53.449509 2020
తరతరాల బూజు
నైజాము రాజు
నా తెలంగాణ
కోటిరతనాల వీణ
అని నినదించిన కవి
అగ్నధార కురిపించిన కవి..
కవితల కత్తులు దూసి
నైజాముకు దడపుట్టించి
జైల్లో పెట్టినా జడవని కవి..
జైలుగోడలనే కాగితాలుగా చేసుకొని
బొగ్గుముక్కలనే కలంగా మార్చుకొని
కణకణరగిలే కవితలు రాసిన కవి..
గాయపడ్డ గుండెనుంచి
గేయాలెన్నో సృష్టించి
బాధలెన్నో భరియించి
భయపడని కవికేసరి
అతడే అతడే మహాకవి దాశరథి
తెలంగాణా చరిత్రలో చెరిగిపోని కీర్తిసిరి
౼ బూర దేవానందం
949499643
సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా