Mon 20 Jul 21:09:31.117754 2020
నిజాం నిరంకుషత్వాన్ని
కూకటి వేర్లతో పెకలించుటకే
అక్షరాన్నే అస్ర్తంగా మార్చుకొని
తెలంగాన అస్థిత్వపథకాన్ని భుజానెత్తుకుని
బుసలు గొడుతున్న నిజాం నిరంకుషత్వాన్ని
భూస్థాపితంజేయడంకై నడుముగట్టినఫిరంగి .
జైలుగోడలపై విప్లవగీతాలు రాసి
నిజంపై అగ్నిదారను కురిపిస్తూ
విప్లవ జ్వాలలతో రుద్రవీణలనుమ్రోగించి
తమిరంతో సమరంజేసిన తెలంగాన
విప్లవ ఉద్యమచైతన్య రథచక్రందాశరథి..
తాను రగిలే నిప్పై రణరంగంలో పిడికిలెత్తి
దగాపడ్డ తెలంగాణ తల్లి దాస్య సుంకలాలను
విముక్తికే ప్రాణాలను ఫణమొడ్డిన త్యాగి
నిత్యం తొలిపొద్దై తూర్పు కొండల్లో ఉదయించే
రవి ఉద్యమ కవి ఫిరంగి దాశరథి.....
ఉప్పరి తిరుమలేష్
9618961384