దశరథములే తన అంతరంగమున
సమాజపు దృక్కోణములను వీక్షించిన ఆ నేత్రములు
ప్రవాహములే ఆ భావాల సారాలను
ధరియించిన అగ్నిధారలు
పీడిత ప్రపంచాన చలియించిన
హృదయమొకటి
ప్రళయముతో చొచ్చుకొచ్చి
రజాకార్ల మెడలు వంచి
ఎగసిపడిన విప్లవమే
తెలంగాణ ధీరత్వమై
తిమిరముతో సమరమంటూ
అక్షరములే శరములుగా....
నడిచిందోక ఉద్యమమే
ఆ పద్యపు వాధ్యములై
నలుదిక్కులు వ్యాపిస్తే
నిధురలేచి పిడికిలి బిగియిస్తే
నీరెండల నేలల్లో
నిజాం దొరల దారుల్లో
నిప్పుకణిక గొంతు చించి
నిగ్గదీసి నినదిస్తే
ఆకాశాన ఉరుము మెరుపు
ఆ ఆగ్రహ జ్వాలలో తళుకై
జగత్తు విముక్తికై
అంతర్నాదపు ఘటికల్ మ్రోగిస్తే
ఆవేశముల్ త్రాగుతూ
అగ్నిహోత్రముల్ వెలిగిస్తూ
ప్రకాశముల్ వెదజల్లితే
రుధిరవర్ణ ఘోషల్లో
రుద్రవీణ తంత్రులు మీటి
పాటల పల్లకిలో
ఆశల చిలుకల శ్వాసలు నింపి
ఆంద్రమో, తెలంగాణమో
తెలుగును వెలిగించిన జ్వాలా తోరణ రూపమై
గాలిబ్ గీతాల గుసగుసలతో
రసరమ్యపు పల్కులు పల్కిన
కవిసింహపు జయంతికి
కవనముతో అక్షరమాల.
శ్రావణి గుమ్మరాజు,
కొత్తచెరువు,
అనంతపురం జిల్లా,
9493400990.
Tue 21 Jul 18:19:42.513583 2020