సీనారే ఓమా సీనారే
ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై ….
ఎటులైన ఈ అడవి సాగిపోనా……
అంటూ సినీరంగములో సాగిన రారాజు
తరాల అంతరాలు నిరంతరమన్న రారాజు
సమగ్ర సాహిత్య తెలుగు గజల్స్ రారాజు
బహుధాన్య కరీంనగర మొలక, హనుమాజీపేట కీర్తి కిరీటి
ఆధునిక కవి ,వక్త,. సాహితి పరిశోధక
బహుభాషా వేత్త, ప్రయోగాల
సినీగేయ ప్రతిభ శీలి ఓ సినారే
అద్భుత రచనల సృష్టికర్త నాగార్జున
సాగర్ కర్పూర వసంతరాయ…..!
ద్విపద ప్రపంచపదుల కావ్యాలంకార విశ్వంభర …. విశ్వానుగ్రహమా...
జ్ఞానపీఠ గ్రహీత పద్మభూషణ
ఆధునికాంధ్ర కవిత్వ శిఖామణి సంప్రదాయాల సిద్ధాంతకర్త
ఓ సి నా.రే
ఎందరో పరిశోధకుల మార్గదర్శకుడా!
శబ్ద శక్తి యుక్తి కలానికి గళ ప్రత్యేకి
నీ సాహిత్య సేవ ను ఏమని పొగిడేం..?
తెలంగాణ, ఉస్మానియా యూనివర్సిటీల కులపతి ఓ సి నా రె
ఆంధ్ర సారస్వత పరిషత్తుకే వన్నెలద్దిన
రాజ్యసభ మెట్లెక్కిన వాడా !
ఘనకీర్తి చరిత్ర నిదర్శనమా
కరీం ఉద్దీన్ పాలన
కరీం షా,! కాస్త కరీంనగర్ గా మారిన సాహిత్య ముద్దుబిడ్డ
మా తెలంగాణ సాహిత్య మాగాని పంట నీవే కదా ఓ సి నా రే
గగనానికి ఎగిసిన విశ్వంభ
విశ్వ వ్యాఖ్యాత ఐక్యమైన తార
నీ ఒక తార వైతివే!
కవి ఐన వాడు కవిగా రాణించాలని
కవి ఐనవాడు రాయని రోజు కవి మరణించినట్లే కవి మనోగతంబని
చివరివరకు నీవు రాస్తూనే గగన వీధినీ
చేరిన భూతల తార సితార సినీ తార ఓసి నా రే మా సి. నా. రె
రచన :పున్న విజయలక్ష్మి
ఫోన్ నెంబర్ 9491875276
కలం : భాస్కర విపంచి
Tue 21 Jul 18:40:39.641389 2020