Tue 21 Jul 18:59:44.284019 2020
కలం యోధుడా..
కావ్య ధీరుడా..
మహానది పయోనిధీ
దాశరథీ..శరథీ..రథీ
ఆకాశవాణి ప్రయోక్త
ఆకాంక్షలవాణి ప్రవక్త
నీ చేతిలో బొగ్గుముక్క
అక్షరాలై మండే అగ్గిచుక్క
నీ జననం తెలంగాణ
నీ పయనం రుద్రవీణ
నీ కవనం అగ్నిధార
నీ మరణం అశ్రుధార
ఓ గజల్ రుబాయి
గాలిబ్ గీతాల భాయి
మహోంద్రోదయ తురాయి
మహోద్యమ సిపాయి
నీ తిమిరంలో సమరం
అక్షరాల తెలుగుదనం
నీ అభిమాన పునర్నవం
స్ఫూర్తినిచ్చు వెలుగు వనం..!!
-కటుకోఝ్వల రమేష్