Wed 22 Jul 12:56:03.397897 2020
ఆతని మాట
పాటగా మారుతుంది
ఆతని పాట కావ్యమై నిలుస్తుంది
ఆయన సినీ గీతాలు
కురిపించును పగలే వెన్నెలలు
ఆయన కావ్య సుమాలు
వెదజల్లును మానవతా పరిమళాలు
ఆతని కలం కదిలితే చాలు
కమనీయ కవితాయేరు గలగల పారు
ఆతని గళం పలికితే చాలు
జుంటి తేనియ జలజల జాలువారు
ఆయనే డా"సి.నారాయణ రెడ్డి గారు...
కవిత్వం నా మాతృభాష అన్నాడు
తన మాతృభాషతో మకరందం పంచాడు
నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు
తెలుగు కవితకు చిరునామా అయినాడు
హనుమాజీ పేటలో పుట్టినాడు
ఆలిండియాకే గర్వకారణమైనాడు
విశ్వంభరా కావ్యం సృష్ఠించినాడు
జ్ఞానపీఠం అధిష్ఠించినాడు
__బూర దేవానందం
9494996143.
సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా