Wed 22 Jul 15:48:33.455114 2020
అక్రమాలపై ఉక్కుపిడికిల్లు బిగించి
అన్యాయంఎదురించేవీరుఁడైయ్యిండు
ధిక్కార స్వరమై ఎక్కుపెట్టిండు
దీనజనబంధుల ధీరుడైయ్యిండు
నైజాంరాజునే ధిక్కరించిండు
అక్షరాయుధంతోనే బెదిరించిండు
బొగ్గుగీతాలతో అగ్గిలా మండి
జైలుగోడల జనపాటలే వ్రాసిండు
రజాకార్లపై ఆక్రోశమే పెంచి
అశ్రువులే అగ్నిధార చేసిండు
తెలంగాణ కోటిరత్నాల వీణ
గొంతెత్తిచాటిండూ గోడుగైనిలిచిండు
ఆళ్వారుస్వామి అండదండలతో
తెలంగాణ తేజమై వెల్లివిరిసిండు
సాహిత్య పుదోట బాటవేసిండు
సకలకవులకు దేవుడయ్యిండు
- వాకిటి రామ్ రెడ్డి పులిగిల్ల , వలిగొండ ,యదాద్రిభువనగిరి జిల్లా
చరవాణి : 9000702093