ప్రజల కన్నీళ్లను "అగ్నిధార"గా మలచి...
నిజంపాలనపై ఎక్కుపెట్టిన మహాకవి...!
"నా పేరు ప్రజాకోటి...నా ఊరు ప్రజావాటి" అంటూ ప్రజా హృదయ "రుద్ర వీణ"తంత్రులను మీటి...
జాగృతం చేసిన ప్రళయ
కవితా మూర్తి...!!
"నాడు మానవతీ నయనమ్ములందు నాగసర్పాలు బుసకొట్టి నాట్యమాడె"నంటూ బాధిత స్త్రీల ఉద్విగ్న బాధను వెల్లడి చేసిన దీనజన పక్షపాతి...!!!
"మా నిజాము రాజు తరతరాల బూజు...దిగిపోవోయ్... తెగిపోవోయ్...గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరి కడతం కొడకో..."అంటూ నినదించిన అభ్యుదయ కవి...!!!!
బానిసత్వ"తిమిరంతో సమరం"చేసి...
"రక్తం నదులై పారకపోతే రాదా రెవల్యూషన్...
శాంతి ఒక్కటే సరియగు సొల్యూషన్"అని తీర్మానించిన శాంతి సమర యోధుడు...!!!!!
"డిగ్రీలు కాదు కొలమానం...నిజమైన చదువు మానవతే" నంటూ నొక్కి వక్కాణించిన మానవతావాది...
దాశరథి...!!!!!!!!
-చంద్రకళ. దీకొండ,
స్కూల్ అసిస్టెంట్,
మల్కాజిగిరి,
మేడ్చల్ జిల్లా
మొబైల్ నెంబర్:9381361384
Wed 22 Jul 18:38:04.209654 2020