Fri 24 Jul 10:26:21.311929 2020
నా మదిలో పల్లవించు భావగీతి నువే కదా!
నవ్వులనే పూ యించెడి ప్రేమగీతి నువ్వే కదా!
అనురాగం అల్లుకున్న పరాజిత ఎవ్వరోయి..
చెలరేగిన ఊసులలో భావ మంత నువే కదా!
ఆదుకునే హృదయాన అనురాగం పరిమళించె,
జాలి గొలుపు మనసులోన గానమంత నువ్వే కదా!
ముసిముసిగా నవ్వుకుంది జాబిలమ్మ కొంటెగాను!
చిలిపిపూలు అల్లుకున్న వెన్నెలంతా నువే కదా!
నా పాటకు పురిగొల్పిన పదబంధం నీ చూపే!
''సునీ'' ఎదల నిలిచిపోవు ప్రేమంతా నువే కదా!
- నెల్లుట్ల సునీత
ఖమ్మం
చరవాణి సంఖ్య 7989460657
కలం పేరు: శ్రీరామ