Sun 26 Jul 11:03:43.976316 2020
మహోజ్జ్వల ఉజ్జ్వల జలసాగరమై
దివిని చీల్చుకొని
కవనపు జల్లుల సవ్వడితో
"కవితా పుష్పకమై" ఎగిసిన
కవిపుంగమా..!!
చావుకు ఎదురొడ్డి
ఎదవాణీ శిఖరంపై
"రుద్రవీణ" మోగించి
"అగ్నిధార"లు కురిపించిన
"కవిసింహ"మా..!!
నీ "యాత్రాస్మృతి"లో
గతకాలపు స్మృతులు
కలకాలం కందిపోని నడకలు..
ఉషోదయపు ఉల్కలు..
సాయుధ సమరంలో
కలం కత్తులుఎత్తుకొని
తంగేడుపువ్వుల దండువోలె
వట్టికోటజట్టుతో గట్టికోటవై
గడీలకు ఎక్కుపెట్టిన నీ కవన ఆన..
నా తెలంగాణ కోటి రత్నాల వీణ...!!!
- ఎమ్. జానకిరామ్
గ్రా. : నల్లగొండ
సెల్. : 9666342772