మనసు దో"సినారె"
సప్తవర్ణాల సింగిడి నుండి
ఎగిసిపడిన నెత్తుటి సిరా సినారె...!!
సాహితీ సేద్యంలో కవనపుజల్లులు కాచి
ప్రక్రియల ప్రతులను తిరగరాసినారే...!!
ప్రపంచపదులతో ప్రజలమనసులో
నవ్వులపువ్వులను పూయింపజేసినారే...!!
నవ్వనిపువ్వై పూలమోములో
పరిమళాల మకరందమై విరబూసినారే...!!
గజల్ లను గళంలో నింపుకొని
గళమెత్తి గాంధర్వ గాలంలో బందీచేసినారే...!!
నన్నుదోచుకుందువటే వన్నెల దొరసానంటూ
సంగీతప్రియుల మనసును దోసినారే...!!
సాహితీయుగాన సాగరమధనం చేసి
సాహితీపుట ప్రవాహాన్ని పరవశింపచేసినారే...!!
విశ్వంభరుడవై తెనుగుసాహితీ పతాకాన్ని
విశ్వ వ్యాపితము చేసినారే...!!
తెలంగాణ తేజమును తేజరింపచేసిన మీకు
వర్తమాన కవులు వందన మందారాలు దారవోసినారే...!!!!
- ఎమ్. జానకిరామ్,
స్కూల్ అసిస్టెంట్,
గ్రా. కొండకింది గూడెం
మం. కేతేపల్లి,
జి. నల్లగొండ,
సెల్. 9666342772.