Mon 27 Jul 13:10:58.594939 2020
1
హనుమాజిపేటలో అతడు జన్మించేను!
ఉస్మానియాలోన ఉన్నత చదువు చదివె!
వచన కవిత్వమునకు వన్నె తెచ్చెనతండు!
పద్యములనే నతను బహుచక్కగా రాసె!
రసరమ్య గీతాల రాగాలు పలకించె!
సాహిత్య సేద్యమును సాగించే నేర్పుగా!
తెలుగు ఠీవిని పెంచి, వెలుగు నింపెను చూడు!
తెలుగు సాహిత్యమున తేజముగను సినారె!!
2
విజ్ఞాన ఖని యతడు విశ్వంభరుడతండు!
తెలుగు తేజమునతడు తెలుగు వెలుగే నతడు!
రచన జేయుటయందు రారాజు యతండును!
గజల్స్ ను రాసినాడు ఘనతను పొందెనతడు!
తెలుగు పాటకు యతడు తీపి మధురిమ నతడు!
చలన చిత్రములకును చైతన్యమేనతడు!
"జ్ఞానపీఠ" అవార్డు జగతిలోన పొందెను!
నిత్య కృషివలుడతను "నిరంతర కవి" సినారె!
✍బి. అనంతయ్య
భా.ప(తె)
శేరిగూడ/రంగారెడ్డి
9676546633