చదివింది మాత్రం రాజ్యభాషలో
వినుతికెక్కింది మాత్రం మాతృభాషలో
పాత కొత్త తరాల కవులకు వారధి
సాహిత్యానికి ఎనలేని సేవచేసిన సారధి
పాలనా విద్యా రంగాలు దాటలేదు ఇతని పరిధి,
అతనో భాషా భువిలో నడిచే నిరంతర పథికుడు
గజల్స్ ను విశ్వగీతియై ఆలపించిన స్థితప్రజ్ఞుడు
కలంలోని కవితలను ఝుళిపించిన విశ్వంభరుడు
సినిమా తోటలో పాటలు పూయించిన సినీతనయుడు
నూతన కవుల కలలకొక మార్గదర్శకుడు
సాహిత్యసిరులు పండించిన కవితా శ్రేష్ఠుడు
ఆకాశంలోని అక్షరాలని రాల్చిన పద్మశ్రీ
ఆకాడమీలేన్నైనా అవార్డులెన్నో పొందిన పద్మభూషణుడు
తెలుగువారికి జ్ఞానపీఠ మందించిన సరస్వతీశ్రీ
సాహితీ సాంస్కృత జగతిన కళాప్రపూర్ణుడు
కావ్యాలు, కథనాలు, గేయాలు, గీతాలు
శ్రావ్యంగా రమ్యంగా వినిపించాడు బుర్రకథలు
నవ్వని పూవై అజంతా సుందరిని జలపాతాలాడించాడు
సి నా రె భారతీయభాషల్లో తెలంగాణ ముద్దుబిడ్డయ్యాడు
అందరి మనసుల్లో సినారే భళారే అనిపించుకున్నాడు.
- ప్రసాద్ తుమ్మా
నాగోల్, హైదరాబాద్
9985438002