Tue 28 Jul 17:45:52.160663 2020
అనుకున్న గట్టును అందుకోలేక
నడుమనే తడబడుతున్న నావ
ప్రయాణం మధ్యలోనే
సతమతమవుతున్న జీవితం వంటిది
పిరికితనంతో వణికిపోయే
హృదయాలను చూస్తే
జ్వాలలకు జాలి కలుగుతుంది.
బతికినంతకాలం
చైతన్యభాసురంగా ఉండాలంటుంది
భానుబింబం.
ఊదితే ఉప్పున ఎగిరిపోయే ఆశలు
దుర్బల మేధకు ఆనవాళ్లు.
సుస్థిర సంకల్పాల వెన్ను పూసలు
ఎదురు దెబ్బలకు
ఏమాత్రం
వంగిపోవు.
భవిష్యత్తును తన పిడికిట్లో పెట్టుకున్న
నిరంతర పురోదృజ్మయుని
నిత్య లక్ష్యమొక్కటే
ఇది 'నారణం మరణం పైనే' అని.
తిరుగులేని ప్రగతి భావుకులెవరైనా కోరుకునేది
ఆ అక్షర సత్యాన్నే కదా!
- డాక్టర్ సి.నారాయణరెడ్డి