Thu 30 Jul 12:05:07.703902 2020
పల్లవి
సింగిరెడ్డి వంశ అంకురమా
సినీ జగతికి కిర్తి శిఖరమా(2)
చరణం
నడిచే తెలుగు తనం
పంచెకు నిండు తనం
పారే జాన పదం
సినారె పాటల వనం
చరణం
సరిగమల గొప్ప దనం
పద్యలకు తేనె తాపడం
నిలువెత్తు రాజ విగ్రహం
వెండి తెరకు దర్పనం
చరణం
నువ్వు మెచ్చిన విశ్వంభరం
పాటలకు నంది వర్దనం
నిన్ను వరించె జ్ఞానపీఠం
నువ్వే తెలుగుకు మకుటం
శబ్ధాలకు స్వర్ణ తోరణం
గజళ్ళకు దక్కిన భరణం
మాటలకు మధుర్యం నువ్వు
మమతలకు కొవెల నువ్వు
- ముద్దం భాగ్యరాణి
M.A TPT
చరవాణి : 7989683227