Thu 30 Jul 12:12:09.168725 2020
చిక్కులు తెలియని సినారె
కవి రాజుల చక్రవర్తి
వసంత రాయలు కర్పూరం లో
కడిగిన మృత్య విలాసం
నవ్వని పువ్వు పద్య పుష్పాలు
జ్ఞానపీఠ విశ్వంభర కు పునాదులు
ఆచార్య త్వం,ఉపకులపతి
రాజ్య సభ ప్రాతినిధ్యం
అధికార భాషా సంఘం
వలచి వచ్చిన పద విన్యాసాలు.
నాడు శ్రీనాథుడు-నేడు సినారె
కవిసామ్రాట్టు లే
కాని
జీవన సంధ్యా రాగాల్లో
సినారె సమ్మోహన రాగం
చిత్రసీమలో చెరగని పాటల సంతకం
బెదరని వ్యక్తిత్వం
గుగ్గురువు మేరునగము సినారెకు
నీరాజన నజరానాలు.
-ఐతా చంద్రయ్య సిద్దిపేట
చరవాణి...9391205299