నవతెలంగాణ-మంథని
మంథని ప్రెస్ క్లబ్ లో ఇటీవల నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులకు,సభ్యులకు,బీసీ సెల్ డివిజన్ అధ్యక్షులు గోటికారి కిషన్ జీ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సెగ్గంరాజేష్,కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ శశిభూషణ్ కాచే, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్,న్యాయవాది రఘోత్తమ రెడ్డి,మాజీ వార్డు సభ్యులు కిష్టన్న,ఎస్సి సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, సత్యనారాయణ గౌడ్, బీమునిలింగయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm