నవతెలంగాణ-గోవిందరావుపేట
భోగి పండుగ వేడుకలను ప్రజలు మండల వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ప్రధానంగా మహిళలు వేకువజామునే లేచి మంగళ స్నానాలు ఆచరించి ముంగిళ్ళను అందంగా అలంకరించి ముగ్గులు వేసి రంగులు అద్ది వాటిలో ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను పెట్టారు. వాటిపై గరిక పోచలను . పిండి చెట్టు ముక్కలను ఉంచి నవధాన్యాలను పోసారు. చిన్నపిల్లలు గొబ్బెమ్మల చుట్టూ సంక్రాంతి పాటలు పాడుతూ పాటలు పాడారు. పలు గ్రామాలలో సర్పంచులు ముగ్గుల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేశారు. పిల్లలను దీవిస్తూ భోగి పండ్లను పోశారు. ఈ దిష్టి తగలకుండా చిరంజీవిగా ఎదగాలి అని దీవించారు. పసర లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పీఏసీఎస్ డైరెక్టర్ సప్పిడి ఆది రెడ్డి నాయకత్వంలో భోగి మంటలు వేశారు. ఈ పండుగతో పాత తరం పోయి కొత్త తరం రావాలని యువత కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఒకరినొకరు భోగి శుభాకాంక్షలు తెలుపుకున్నారు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామాలలో ప్రజా పతినిధులు యువజన సంఘాలు ఆధ్వర్యంలో కలర్ఫుల్ బ్యానర్లు వెలిశాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Jan,2022 04:41PM