నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని హామల్ వాడు ప్రాంతంలో సీఐటీయూ, ఐద్వా ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది. అనంతరం విజేతలను నిర్ణయించి బహుమతులను అందజేయడం జరిగింది ఈ బహుమతుల ప్రధానోత్సవం లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు వి ఆనంద్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, సిపిఎం నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్, ఐద్వా ఉపాధ్యక్షులు అనిత తదితరులు విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలు సిరిసంపదలతో ఆనందంగా వెల్లివిరిసే సందర్భంలో మహిళలు చైతన్యవంతంగా ముందుకు రావటం శుభ పరిణామమని ఈ ప్రాంతంలోని ప్రజా సమస్యల పైన కూడా ఐక్యంగా కలిసి పోరాటం చేయాలని అప్పుడే తమ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సీపీఐ(ఎం) పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ పోటీలలో ప్రథమ బహుమతి వైష్ణవి, ద్వితీయ బహుమతి అంజమ్మ గెలుచుకున్నారు. వీరితో పాటు గంగమ్మ, విశాలిని గంగమ్మ, రాజేశ్వరి, సుజాత, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Jan,2022 05:34PM