నవతెలంగాణ-మంథని
మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కూచిరాజ్ పల్లి గ్రామంలో శుక్రవారం మహిళలకు భోగి పండుగ రోజున ముగ్గుల పోటీలు నిర్వహించినారు. ఆ గ్రామ కమిటీ అధ్యక్షులు బోయిని నారాయణ, అయిదవ వార్డు కౌన్సిలర్ నక్క నాగేంద్ర శంకర్ లు ముఖ్యఅతిథులుగాహాజరై ముగ్గులను పరిశీలించి విజేతలకు బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలకు సౌల్ల సరిత,గంధం జ్యోతి,మర్రి పద్మ న్యాయనిర్ణేతలుగాను వ్యవహరించారు. ఈపోటీల్లో అంబటి మౌనికకు మొదటి బహుమతి, కామని లావణ్యకు రెండవ బహుమతి, శేనపురం రవళికి మూడవ బహుమతి, నార్ల పద్మకు నాలుగవ బహుమతి , కామని మనిషాకు ఐదవ బహుమతి అందుకున్నారు. ఈ కార్యక్రమానికి బహుమతులు స్పాన్సర్ చేసిన వారు శ్రీ వైష్ణవి టెక్స్ టైల్స్ & కిడ్స్ వేర్, శ్రీ సాయి కిడ్స్ వేర్& గర్ల్స్ వేర్ స్పాన్సర్స్ చేయగా, ఈ కార్యక్రమంలో సిరివెన్నెల స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అంబటి నర్సింగ్, మిట్టపల్లి కిషోర్, గౌతమేశ్వర దేవాలయ ధర్మకర్త, అంబటి శ్రీనివాస్,కామని రమేష్, చిప్ప కొమురయ్య,కామని వెంకటేష్, కామని శంకర్, కామని అభిలాష్, చిప్ప శంకర్ పెద్ద ఎత్తున మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Jan,2022 06:00PM