నవతెలంగాణ కోడేరు
మండల ప్రజలకు ఎంపీపీ కొండ రాధా సుధాకర్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాలు, సుఖసౌఖ్యాలు ప్రతి ఒక్కరు ఇళ్లల్లో వర్ధిల్లాలని, మండల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎంపీపీ కొండ రాధా సుధాకర్ రెడ్డి అన్నారు. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని వారు కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm