నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్,కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రజలకు, రైతాంగానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు శుక్రవారం తెలిపారు. ఈ సంక్రాంతి ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో విరాజిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో స్వరాష్ట్రంలో సాగునీటి రంగంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, పంటపెట్టుబడి సాయం,రైతు భీమా,24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ పలు రైతు సంక్షేమ పథకాలు, పటిష్ట చర్యలతో కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నిత్య సంక్రాంతిని నెలకొల్పిందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో వ్యవసాయం అనుబంధ రంగాలలో పండుగ వాతావరణం నెలకొల్పారన్నారు.ఎన్ని కష్టాలెదురైనా సమర్థవంతంగా ఎదుర్కుంటామని, రైతుల జీవితాల్లో నిత్య సంక్రాంతులను కొనసాగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ, సంక్రాంతి పండుగను పచ్చదనం నడుమ ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Jan,2022 07:21PM